స్టార్ ప్రొడక్షన్ హౌస్ లో సందీప్ కిషన్ తమిళ్ ప్రాజెక్ట్

స్టార్ ప్రొడక్షన్ హౌస్ లో సందీప్ కిషన్ తమిళ్ ప్రాజెక్ట్

Published on Mar 24, 2015 9:18 AM IST

sandeep-kishan
నిర్మాతలకు లాస్ లేకుండా, సినిమా సినిమాకి ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ ఒక్క తెలుగులోనే కాకుండా కుదిరినప్పుడల్లా తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సందీప్ కిషన్ మరో తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా తమిళంలో ఓ స్టార్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో చేయనున్నాడు. ఇక్కడ సర్ప్రైజ్ అయ్యే విషయం ఏమిటంటే ఆ ప్రొడక్షన్ హౌస్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉండడం.

ఇక విషయంలోకి వెళితే తమిళ్ స్టార్ హీరోస్ సూర్య, కార్తీల బ్రదర్ ప్రభు నిర్మాతగా వ్యవహరిస్తున్న బ్యానర్ స్టూడియో గ్రీన్. ఈ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో సందీప్ కిషన్ తన తదుపరి సినిమా చేయనున్నాడు. షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసి అవార్డ్స్ కూడా గెలుచుకున్న లోకేష్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చాలా రియలిస్టిక్ గా సాగే డార్క్ కామెడీ జోనర్ లో ఈ సినిమా ఉండనుంది. త్వరలోనే ఎ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళి కంటిన్యూ షూటింగ్ చేసి ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాని తమిళంలో మాత్రమే తెరకెక్కిస్తున్నారు. కానీ సందీప్ కిషన్ మరియు స్టూడియో గ్రీన్ వారికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడం వలన ఈ సినిమాని తెలుగులో డబ్ చేసే అవకాశం ఉంది.

ఇది పక్కన పెడితే సందీప్ కిషన్ నటించిన ‘టైగర్’ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. కాశీ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ లు ముఖ్య పాత్రలు పోషించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు