
వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటూ ఇప్పుడున్న యువహీరోల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపును, మార్కెట్ ను ఏర్పరుచుకుంటూ సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ ఏడాది ‘టైగర్’తో మంచి హిట్ కొట్టిన సందీప్ అప్పుడే తన తదుపరి తమిళ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి, విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇది కాకుండా తాజాగా సందీప్ కిషన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో చేయనున్న ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ఇటీవలే అధికారికంగా ప్రారంభం కూడా అయ్యింది.
తెలుగులో రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయిన పిజ్జా, విల్లా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సివి కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే సివి కుమార్ అందాల భామ తాప్సీని సంప్రదిస్తున్నాడు. ఇటీవలే కుమార్ తాప్సీని కలిసి కథ చెప్పాడు. ఇంకా తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా, ఈ సినిమాపై ఆసక్తిగానే ఉన్నట్టు సమాచారం. త్వరలోనే తాప్సీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఈ చిత్ర టీం ఎదురు చూస్తోంది.
ఏకకాలంలో పెద్ద ఎత్తున తెరకెక్కనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ, దర్శక నిర్మాత సీవీ కుమార్ తో కలిసి నిర్మిస్తోంది.

