సందీప్ వంగ ఈ సారి మెగాస్టార్ తో ?

Published on Oct 21, 2019 3:54 pm IST

‘అర్జున్ రెడ్డి’తో తెలుగునాట సంచలనం రేపిన దర్శకుడు సందీప్ వంగ ఆ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతొ రీమేక్ చేసి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ వంగ. ట్రేడ్ వర్గాలు షాహిద్ కపూర్ కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్స్ సాధించింది కబీర్ సింగ్. అందుకే కబీర్ సింగ్ నిర్మాతలు తమ తదుపరి చిత్రాన్ని కూడా సందీప్ తోనే చేస్తున్నారు.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సందీప్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసాడట. అతి త్వరలోనే మెగాస్టార్ కి కథ వినిపించబోతున్నాడని.. చిరుకి కథ నచ్చితే ఈ సినిమాని హిందీ తెలుగు భాషల్లో తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా విమర్శకులు సందీప్ వంగ మంచి స్టోరీ టెల్లర్ అని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేస్తాడని, నటీనటుల నుండి పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్న విధానం చాలా బాగుందని కితాబిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More