‘పొట్టేల్’ టీజర్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి వంగా

‘పొట్టేల్’ టీజర్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి వంగా

Published on Apr 18, 2024 3:14 PM IST

సాహిత్ మోతుకూరి మూడవ ప్రాజక్ట్ గా యువ చంద్రా, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పొట్టేల్. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌ పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే పోస్టర్‌లు పాటలతో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా నేడు జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఆనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ ని లాంచ్ చేసి మేకర్స్ కి బెస్ట్ విషెస్ తెలియచేసారు.

కుల వివక్ష కలిగిన తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో హీరో యువ చంద్ర కృష్ణ తన కుమార్తెకు విద్య ద్వారా మెరుగైన జీవితాన్ని అందించాలని కోరుకునే బాధ్యతగల భర్తగా మరియు తండ్రిగా కనిపించారు. అయితే గ్రామంలో పవిత్రమైన గొర్రె తప్పిపోయినప్పుడు, గ్రామస్థులు అతనిపై దాడి చేయడం అనంతరం పరిస్థితులు మరింత దిగజారిపోవడం జరుగుతుంది. మరి ఆపైన ఏమి జరిగిందనే ఇంట్రెస్టింగ్ కథ, కథనాలతో తెరకెక్కిన పొట్టేల్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలని పెంచిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా త్వరలో మూవీ యొక్క రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు