విజయ్ దేవరకొండ కోసం కథ రాశాడట !

Published on Jul 6, 2020 8:03 pm IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘సందీప్ వంగ’. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఏకంగా బాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మ‌రో భారీ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించ‌డానికి రెడీ అవుతున్న టైమ్‌లో.. లాక్‌ డౌన్ కార‌ణంగా సందీప్ ప్లాన్ మొత్తం తారుమారైపోయింది. అయితే ఈ లాక్‌ డౌన్ లో సందీప్ రెండు క‌థ‌ల్ని సిద్ధం చేసాడట. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ కోసమట.

అయితే ఈ సినిమా మరో రెండేళ్లు సమయం పడుతుంది. మొత్తానికి అర్జున్ రెడ్డి కాంబోలో మ‌రో సినిమా రాబోతుంది. ప్రస్తుతం సందీప్ మరో హింధీ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ తర్వాతి సినిమాను కూడా భారీ స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. వీరితోపాటే సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.

సంబంధిత సమాచారం :

More