“సాహో” మూవీ నుండి తప్పుకున్న సంగీత త్రయం

Published on May 27, 2019 5:45 pm IST

బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్,ఎహ్సాన్,లాయ్ లు ఈ రోజు తాము సాహో మ్యూజిక్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాము అని ప్రకటించడం ద్వారా సంచలనానికి తెరదీశారు. ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వారు అధికారకంగా తెలియజేసారు. తాము ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాము అని చెవుతూనే, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

విడుదలైన “సాహో” మూవీ టీజర్ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ మ్యూజిక్ త్రయం అధికారకంగా తప్పుకోవడంతో, థమన్ ని ఎంపిక చేస్తారా లేక, ఇంకో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :

More