సప్తగిరి కొత్త సినిమా వివరాలు !
Published on Mar 1, 2018 2:27 pm IST

సప్తగిరి కమీడియన్ గా చేస్తూనే హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సప్తగిరి ఎల్ఎల్ బిసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటుడు తాజాగా మరో సినిమా హీరోగా చెయ్యడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డితో సప్తగిరి సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈశ్వర్ రెడ్డి గతంలో అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రమ్ శీకాకులం సినిమాకు దర్శకత్వం వహించాడు.

సప్తగిరి, ఈశ్వర్ రెడ్డి సినిమా న్యూస్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు కథ విక్రమ్ రాజ్ అందించగా మాటలు డైమండ్ రత్నబాబు రాసున్నారు. టీం వర్క్ తో పక్కా స్క్రిప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని సమాచారం.

 
Like us on Facebook