విజయ్ దేవరకొండ పై తమ ప్రేమను వెల్లడించిన సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్

విజయ్ దేవరకొండ పై తమ ప్రేమను వెల్లడించిన సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్

Published on Jul 12, 2022 7:00 PM IST

కరణ్ జోహార్ యొక్క ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ మరింత ఆసక్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రసిద్ధ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. కాఫీ విత్ కరణ్ S7 E2 ప్రోమో ఈరోజు విడుదలైంది. ఈ తాజా ఎపిసోడ్‌లో బాలీవుడ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ సెలబ్రిటీలు గెస్ట్‌లుగా విచ్చేశారు. ప్రోమోలో, ఇద్దరు నటీమణులు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండపై తమ ప్రేమను వెల్లడించారు.

కరణ్ జోహార్ సారా తనకు డేట్ కావాలనుకునే పేరు పెట్టమని అడిగగా, దేవరకొండ అని చెప్పింది. జాన్వీ ముసిముసిగా నవ్వుతుండగా, కరణ్ వెంటనే జాన్వీని విజయ్ దేవరకొండతో చూస్తానని చెప్పాడు. అప్పుడు సారా, జాన్విని ఆమెకు చాలా ఇష్టమా అని ప్రశ్నిస్తుంది. మొత్తం పార్ట్ సరదాగా జరిగింది మరియు టాలీవుడ్ నటుడిపై వారి ప్రేమను తెలుసుకోవాలంటే, మనం కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. రణవీర్ సింగ్ మరియు అలియా భట్ నటించిన మొదటి ఎపిసోడ్ గత వారం విడుదలైంది. త్వరలో సమంత ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు