‘సారంగ దరియా’ మాస్ స్పీడ్..ఈ గ్యాప్ లోనే మరో మార్క్!

Published on Mar 18, 2021 12:00 pm IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్రెష్ అండ్ మ్యాజికల్ చిత్రం “లవ్ స్టోరీ”. రీసెంట్ మిడ్ రేంజ్ సినిమాల్లో భారీ హైప్ ను సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా గతంలో “ఫిదా”లో ఓ సాంగ్ తో శేఖర్ మరియు సాయి పల్లవిలు ఎలాంటి సెన్సేషన్ ను నమోదు చేసారో తెలిసిందే. మరి ఈసారి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ ట్రాక్ తో అదరగొడుతున్నారు.

ఈ చిత్రంలో స్పెషల్ గా ప్లాన్ చేసిన “సారంగ దరియా” అనే పాట అనూహ్య రెస్పాన్స్ ను అందుకుంది. మొదటి రోజే గట్టి రెస్పాన్స్ ను అందుకొని మాస్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. గత మూడు రోజుల కితమే 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను లాక్ చేసిన ఈ సాంగ్ మళ్ళీ ఈ గ్యాప్ లోనే ఇంకో 12 మిలియన్ వ్యూస్ ను రాబట్టేసింది. దీనితో ఇప్పుడు 62 మిలియన్ వ్యూస్ ను ఈ సాంగ్ అందుకుంది. మరి ఫైనల్ గా పవన్ సి హెచ్ సంగీతం అందించిన ఈ సాంగ్ హవా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :