సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ‘మైండ్ బ్లాంక్’ అనే మాస్ లిరికల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సాంగ్ గురించి తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేస్తూ.. ‘డప్పులతో మేము రెడీ.. స్టెప్ లతో మీరు రెడీయా ?’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చిన మహేష్ బృందం ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
DAPPULATHO Memu READY…
STEPpulatho Meeru READY aa ?!?#MindBlock at 5:04PMLets Rock it Guys !! ????❤️????????#MassMBMondays #MBSONG #SarileruNeekevvaru
Super⭐️@urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @iamRashmika @ShreeLyricist @SVC_official @RathnaveluDop @LahariMusic ???? pic.twitter.com/gaaFRXXOKs
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 2, 2019


