రెండో సారి కూడా వార్ వన్ సైడ్ చేసేసిన సూపర్ స్టార్..!

Published on Jul 9, 2020 12:44 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “సరిలేరు నీకెవ్వరు”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దీనితో పాటుగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మొట్ట మొదటి సారి జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ కాగా ఆల్ టైం రికార్డు టీఆర్పీ రేటింగ్ తో ఈ చిత్రం ఏ సినిమా రికార్డును కూడా వదిలి పెట్టలేదు. దీని తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత ఒరిజినల్ సౌండ్ క్వాలిటీతో మరింత హెచ్ డి ప్రింట్ తో పాటు డిలీట్ చేసిన సన్నివేశాలతో కలిపి సెకండ్ టెలికాస్ట్ చేస్తామని తెలిపారు.

అలా ప్లాన్ చేసిన ఈ చిత్రం రెండో టెలికాస్ట్ లో కూడా దుమ్ము రేపింది. గత జూన్ 28 న టెలికాస్ట్ కాబడిన ఈ చిత్రం సెకండ్ టెలికాస్ట్ లో 17.4 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. మాములుగా ఈ చిత్రానికి సెకండ్ టెలికాస్ట్ లో 15 టీఆర్పీ రేటింగ్ కొడితేనే అది అదిరిపోయే నెంబర్ అని సినీ ట్రాకర్స్ అన్నారు. కానీ ఆ అంచనాలకు మించే రికార్డు స్థాయి టీఆర్పీ రాబట్టింది.

దీనితో పాటు అదే రోజున స్టార్ మా ఛానెల్లో దుల్కర్ సల్మాన్ మరియు రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా పెరియ సామి దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ చిత్రం “కనులు కనులను దోచాయంటే” ను ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యగా దానికి 7.1 టీఆర్పీ వచ్చిందట. మొత్తానికి మాత్రం సెకండ్ టెలికాస్ట్ లో కూడా సూపర్ స్టార్ వార్ వన్ సైడ్ చేసేసారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More