గుంటూరులో మహేష్ నాన్ బాహుబలి రికార్డ్.

Published on Jan 17, 2020 2:00 pm IST

మహేష్ బాబు తన ఫార్మ్ కొనసాగిస్తున్నాడు. భరత్ అనే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన ఆయన వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. గత ఏడాది మహర్షి చిత్రంతో హిట్ కొట్టిన మహేష్ 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తో మొదలెట్టారు. కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదలైన అన్ని కేంద్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ఇక గుంటూరులో ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది. ఆరు రోజులకు గాను సరిలేరు నీకెవ్వరు 7.72 కోట్ల షేర్ రాబట్టింది. ఇది గుంటూరులో నాన్ బాహుబలి రికార్డు కావడం విశేషం.

ఇక నైజాంలో కూడా మహేష్ మూవీ 25.65 కోట్ల షేర్ రాబట్టి ముప్పై కోట్ల వసూళ్ల దిశగా వెళుతుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి వస్తున్న స్పందన రీత్యా నేడు వరంగల్ లోని హన్మకొండ లో ఈ చిత్ర విజయోత్సవ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. మహేష్ రష్మిక జంటగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత ఏడాది సంక్రాంతికి ఎఫ్2 చిత్రంతో విజయం అందుకున్న అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More