మహేష్ సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ చివరి దశకు చేరింది. ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ పూర్తవగా, సాంగ్స్ చిత్రీకరించే పనిలో పడ్డారట దర్శకుడు. ఐతే తాజా సమాచారం ప్రకారం వచ్చే 4,5 తారిఖులలో రెండు సాంగ్స్ చిత్రీకరించనున్నారట. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలోని బృందం రేపటినుండి రిహార్సల్స్ మొదలుపెట్టి చిత్రీకరణకు సన్నద్ధం కానున్నారట. ఈ రెండు సాంగ్స్ మహేష్, రష్మిక లమధ్య వచ్చే డ్యూయట్ సాంగ్స్ అని తెలుస్తుంది. హైదరాబాద్ లోనే ఈ పాటల చిత్రీకరణ జరగనుంది.
కాగా రేపు సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల కానుంది. ఈనెలలో ప్రతి సోమవారం ఒక సాంగ్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఒక్క టీజర్ తో సరిలేరు నీకెవ్వరు మూవీ హైప్స్ ఆకాశానికి చేరుకోగా, ఇక పాటల అనంతరం మరింత క్రేజ్ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. అనిల్ రావిపూడి చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.


