బన్నీ మూవీ హిందీ జనాలకు తెగనచ్చేసింది.

Published on Jul 27, 2019 2:45 pm IST

అల్లు అర్జున్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు” బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ మూవీ అల్లు అర్జున్ కేరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఐతే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ హిందీ డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ యూట్యూబ్ లో హిందీ వెర్షన్ విడుదల చేయగా భారీ ఆదరణ దక్కించుకుంది.

దాదాపు ఒక ఏడాది క్రితం యూట్యూబ్ లో విడుదలైన సరైనోడు చిత్రానికి ఇప్పటివరకు ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. అలాగే ఇంకొద్ది రోజులలో 200మిలియన్ వ్యూస్ కి కూడా ఈ మూవీ చేరుకోనుంది. కాగా ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, సుశాంత్,నవదీప్ ,టబు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :