Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సర్కార్ టీజర్ విడుదల తేదీ ఖరారు !
Published on Oct 10, 2018 1:46 pm IST

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘సర్కార్’. ఈ చిత్రంలో విజయ్ సరసన ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం టీజర్ ను ఈ నెల 19న విడుదల చెయ్యబోతున్నారు.

కాగా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎ ఆర్ రహెమాన్ సంగతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 8న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :