తెలుగులో కూడా భారీగా విడుదలవుతున్న ‘సర్కార్’ !

Published on Oct 28, 2018 12:56 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘సర్కార్’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ తెలుగు వెర్షన్ మొత్తం 750 స్క్రీన్లలో విడుదలవ్వనుంది. విజయ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని స్క్రీన్స్ లో విడుదల అవ్వడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాదా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే మణిరత్నం నవాబ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన అశోక్ వల్లభనేనినే, సర్కార్ చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :