సర్కార్ మూవీ సెన్షేష‌న్.. మొత్తం ఎన్ని స్క్రీన్‌లో తెలిస్తే షాకే..!

Published on Oct 29, 2018 12:04 pm IST


త‌మిళ ఇళయదళపతి, స్టార్ హీరో విజ‌య్ – సెన్షేష‌న్ డైర‌క్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం స‌ర్కార్. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌, ప‌క్కా మాస్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో విజ‌య స‌రస‌న కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. వ‌ర‌ల‌క్ష్మీ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఏఆర్ రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత క‌ళానిథి మార‌న్ భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రాన్ని దీపావ‌ళికి గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. తుపాకి, క‌త్తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ అవ‌డంతో ఈ చిత్రం పై విప‌రీత‌మైన అంచ‌నాలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి హైరేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డంతో.. స‌ర్కార్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జర‌గింది. ఒక్క‌ తమిళనాడులోనే స‌ర్కార్ సినిమా 83 కోట్లకి అమ్ముడు పోవ‌డంతో ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ కు అద్దం పడుతోంది. దీంతో ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 80 దేశాల్లో, 1200 స్క్రీన్ల‌లో రిలీజ్ కానుంద‌ని టాక్. ఒక్క తెలుగులోనే దాదాపు 750 స్క్రీన్ల‌లో విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి క్రేజీ కాంబినేషన్, భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న స‌ర్కార్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :