నార్మల్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన “సర్కారు వారి పాట”.!

Published on Jun 23, 2022 10:38 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ఓ రకంగా మహేష్ నుంచి సరికొత్త వెర్షన్ ని ప్రెజెంట్ చేస్తున్నట్టు అనిపించింది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు. మరి ఎట్టకేలకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అక్కడ భారీ హిట్ ని అందుకొని ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు మొదట రెంటల్ స్టీమింగ్ కి తీసుకురాగా ఇప్పుడు ఫైనల్ గా నార్మల్ స్ట్రీమింగ్ కి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేసారు. ఈరోజు జూన్ 23 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో ఇక ఇందులో మరోసారి ఈ చిత్రాన్ని చూసి అయితే ఎంజాయ్ చెయ్యొచ్చు.

సంబంధిత సమాచారం :