“సర్కారు వారి పాట” నుంచి ఆగని లీక్స్.?

Published on Jul 20, 2021 1:27 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” అని అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మళ్ళీ జోరుగా లీక్స్ మొదలయ్యాయి.

ఇది వరకు దుబాయ్ షెడ్యూల్ లో ఉన్నప్పుడే పలు సన్నివేశాలు ఫోటోలు వీడియోలు బయటకి వచ్చి ఒక లెక్కలో వైరల్ అయ్యాయి. అయితే మరి ఇపుడు కొత్త షెడ్యూల్ నుంచి ఏకంగా వీడియోలే గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పైగా వాటిని మహేష్ అభిమానులే జోరుగా షేర్ చేసుకుంటుండడం గమనార్హం.

దీనితో చిత్ర నిర్మాణ సంస్థ కూడా అధికారికంగా స్పందించాల్సి వచ్చింది. కానీ ఈ లీక్స్ మాత్రం ఆగడం లేదని తెలుస్తుంది. ఇప్పటికీ కూడా కొందరు అభిమానుల్లో షూటింగ్ స్పాట్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇదంతా మరి ఎగ్జైట్మెంట్ ని కిల్ చేసేది లానే ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :