మహేశ్ ఫ్యాన్స్‌ను రెడీగా ఉండమంటున్న థమన్..!

Published on Jul 29, 2021 1:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ రాలేదు. సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కల నెరవేరబోతుంది.

అయితే ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి కీలక అప్డేట్స్ రాబోతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా థమన్ కూడా ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు. సర్కారు వారి పాట మ్యూజిక్ స్టార్ట్ చేశామని, అతి త్వరలోనే మీ ముందుకు రాబోతున్నామని, రెడీగా ఉండండి అంటూ కీర్తి సురేశ్‌తో కలిసి దిగిన ఫోటోను థమన్ షేర్ చేశాడు. అయితే ఈ అప్డేట్ కూడా ఆగష్ట్‌లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా వరుస అప్డేట్‌లతో మహేశ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :