ట్విట్టర్ లో “సర్కార్ వారి పాట ఫస్ట్ నోటీస్” సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది గా!

Published on Aug 1, 2021 7:40 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మహేష్ బాబు పుట్టిన రోజు దగ్గర పడుతుండటం తో ఈ చిత్రం నుండి చిత్ర యూనిట్ ఫస్ట్ నోటీస్ అంటూ ఫస్ట్ లుక్ ను నిన్న సాయంత్రం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పోస్టర్ కూల్ గా, పవర్ ఫుల్ గా ఉండటం తో అభిమానులు, ప్రేక్షకులు లైక్స్ మరియు షేర్ లతో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశారు.

ఇప్పటి వరకు ట్విట్టర్ లో 24 గంటల్లో ఎక్కువ లైక్స్ 95.6 కే లైక్స్ ను సొంతం చేసుకున్న పోస్టర్ గా, ఎక్కువ రీ ట్వీట్స్ 49.1కే ను సొంతం చేసుకున్న పోస్టర్ గా తెలుగు సినిమా పరిశ్రమ లో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అయితే మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్ 9 వ తేదీన ఉండటంతో చిత్ర యూనిట్ టీజర్ లేదా గ్లింప్స్ ను విడుదల చేసే అవకాశం ఉంది.అప్పటి వరకు ప్రేక్షకులని, అభిమానులను సర్కారు వారి పాట టీమ్ అలరించనుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :