మహేష్ సర్కారు వారి పాట స్ట్రీమ్ అయ్యేది ఈ ఓటిటి లో నేనా?

Published on Aug 3, 2021 10:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తీ సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్దం గా ఉంది. వచ్చే ఏడాది జనవరి 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ల పై ప్రస్తుతం పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం థియేటర్ల లో విడుదల అయిన తర్వాత ప్రముఖ ఓటిటి సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే డిజిటల్ రైట్స్ కోసం పెద్ద మొత్తం లో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :