సీరియస్ పేస్, సిగార్ తో శర్వానంద్ “రణరంగం” ఫస్ట్ లుక్

Published on May 25, 2019 5:37 pm IST

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్స్ గా యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “రణరంగం”. శర్వానంద్ 27 వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇవాళ విడుదల చేసారు. నోట్లో చుట్ట, అక్కడక్కడా నెరిసిన గడ్డంతో సీరియస్ పేస్ తో ఉన్న శర్వా మాస్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ గెట్ అప్ లో శర్వా 40 ప్లస్ ఏజ్ లో ఉన్నట్లున్నారు.

మొదటి సినిమా “స్వామి రారా” తో విభిన్న దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్న సుధీర్ వర్మ శర్వానంద్ ను రెండు విభిన్న గెట్ అప్స్ లో ప్రెసెంట్ చేయనున్నాడని సమాచారం. ఆగస్టు 2 న విడుదల కానున్న ఈ మూవీకి ప్రశాంత్ పిళ్ళై సంగీతం, దివాకర్ మని సినిమాటోగ్రఫీ, నవీన్ నోలి ఎడిటింగ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More