శాటిలైట్ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ది ఫ్యామిలీ స్టార్”

శాటిలైట్ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ది ఫ్యామిలీ స్టార్”

Published on Apr 5, 2024 5:01 PM IST

టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ది ఫ్యామిలీ స్టార్”. మరి సాలిడ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రంని విజయ్ మృణాల్ అభిమానులు ఎంజాయ్ చేస్తుండగా ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులకు సంబంధించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ సినిమా ఓటీటీ హక్కులు ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కానీ టీవీ పార్ట్నర్ ఎవరు అనేది తెలియరాలేదు. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని స్టార్ మా వారు సొంతం చేసుకున్నారు. దీనితో థియేట్రికల్ రన్ అనంతరం వీటిలో ఈ చిత్రాన్ని చూడవచ్చు. మరి ఈ చిత్రంలో జగపతిబాబు, రవిబాబు, అభినయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు