“నారప్ప” చూసాక “తిమ్మరుసు” ఎగ్జైటెడ్ రెస్పాన్స్.!

Published on Jul 23, 2021 11:01 am IST


అందరి అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ ఫ్యామిలీ డ్రామా చిత్రం “నారప్ప”. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ రీమేక్ చిత్రం నేరుగా ఓటిటిలోనే విడుదల కాబడి అదిరే హిట్ టాక్ ను తెచ్చుకుంది. దీనితో ఓటిటిలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుంచి కూడా ఒకే రకమైన రెస్పాన్స్ వచ్చింది.

మరి లేటెస్ట్ గా ఈ సినిమా చూసిన మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కూడా తన ఎగ్జైట్మెంట్ రెస్పాన్స్ ను తెలియజేసాడు. నారప్ప లో వెంకీ మామ ఊర మాస్ రాంపేజ్ ని ఎంజాయ్ చేసానని అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కి కంగ్రాట్స్ చెబుతూ యువ నటుడు కార్తీక్ రత్నం కి కో కూడా అభినందనలు తెలిపాడు. మరి సత్యదేవ్ కూడా ఎంతటి ఇంపాక్ట్ కలిగించే నటుడో తెలిసిందే. అలాగే తాను నటించిన లేటెస్ట్ చిత్రం “తిమ్మరసు” ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :