“కోతి కొమ్మచ్చి”కి అనూప్ ను లాక్ చేసిన సతీష్ వేగేశ్న!

Published on Sep 23, 2020 9:08 am IST

టాలీవుడ్ లెజెండరీ యాక్షన్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. రాజ్ దూత్ తో పరిచయం అయిన ఈ హీరో ఇపుడు పలు ప్రాజెక్టులను తన లైన్ లో ఉంచుకున్నాడు. అలా ఉన్న వాటిలో జాతీయ అవార్డు గ్రహీత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో “కోతి కొమ్మచ్చి” అనే సినిమా కూడా ఒకటి.

అయితే ఈ చిత్రంలో దర్శకుడు సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగ్నేశ కూడా మరో హీరోగా నటిస్తుండడం విశేషం. అయితే ఇపుడు ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్ ను లాక్ చేసారు. ఇప్పటికే టాలీవుడ్ ఆడియెన్స్ కు ఎన్నో వండర్ ఫుల్ ఆల్బమ్స్ ను ఇచ్చిన అనూప్ ఈ చిత్రానికి మొత్తం 5 పాటలను సమకూర్చనుండగా ఇప్పటికే మూడు పాటలను కంప్లీట్ చేసేసారట. అలాగే ఈ చిత్రం వచ్చే దసరా సందర్భంగా లాంచ్ కానుండగా ఇంకా హీరోయిన్స్ ఎవరు అన్నది ఫైనలైజ్ కాలేదు.

సంబంధిత సమాచారం :

More