హీరోగా పొలిమేర సినిమాలతో సంచలనం సెట్ చేసిన టాలెంటెడ్ టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే “పాడేరు 12వ మైలు”. ఉత్తరాంధ్ర వైపున ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీస్సులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్. కె మాట్లాడుతూ…”నా స్నేహితుడు త్రినాధ్ నిర్మాతగా నేను డైరెక్టర్ గా మీ ముందుకు పాడేరు 12వ మైలు సినిమాతో వస్తున్నాను.జూన్ 6 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది, సత్యం రాజేష్, ప్రభాకర్, శ్రవణ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళుతున్నాము. పొలిమేర , పొలిమేర 2 తరువాత సత్యం రాజేష్ నటించిన పాడేరు 12వ మైలు సినిమా సస్పెంస్ అండ్ లవ్ ఎలెమెంట్స్ తో రాబోతోంది, మాకు సపోర్ట్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
అలాగే నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ…”పాడేరు 12వ మైలు సినిమా బాగ వచ్చింది, డైరెక్టర్ , యాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడంతోనే మా సినిమా ఇంత కలర్ ఫుల్ గా ఉంది, శ్రీ పాడేరు మొదకొండమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మా పై ఎప్పుడూ ఇలానే ఉండాలని, ప్రేక్షకులు, మీడియా వారు మా సినిమాను తప్పకుండా పాజిటీవ్ గా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది, ఇదివరకు మేము విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది, సినిమా కూడా నచ్చుతుందని నమ్మకంగా” ఉందన్నారు.


