‘సవ్యసాచి’ ట్రైలర్ విడుదల తేదీ ఖారారు !

Published on Oct 22, 2018 5:35 pm IST

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను అక్టోబర్ 24న సాయంత్రం 3 గంటలకు విడుదల చేయబోతున్నామని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.

వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు ఆర్.మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కూడా కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. బాహుబలి చిత్రానికి గ్రాఫిక్స్ ను అందించిన మకుట సంస్థనే ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ ను అందిస్తోంది. ప్రేమమ్ తరువాత చైతు, చందూ మొండేటిల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :