మహేష్, సోను సూద్ మధ్య ‘ఆగడు’ సన్నివేశాలు

Published on Apr 7, 2014 5:04 pm IST

Mahesh-Babu-Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఆగడు చిత్ర సన్నివేశాల చిత్రీకరణ చురుగ్గా కొనసాగుతోంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా, సోను సూద్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటోంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, మహేష్ బాబు కు తండ్రిగా ఈ చిత్రంలో కనిపించనున్నారు.

ఇటీవలే మహేష్ బాబు, సోను సూద్ మధ్య కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రం లో కనిపించనున్నారు.

భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్ద నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం ద్వితియార్దం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :