వివిఆర్ లో ఆ సీన్లు తీసేశారట !

Published on Jan 13, 2019 10:10 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ భారీ అంచనాల మధ్య జనవరి 11న విడుదలై నెగిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. అయితే మొదటి రోజు మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఇక ఈ చిత్రంలోనీ కొన్ని సన్నివేశాలఫై రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. దాంతో ఈచిత్రంలోని ప్రీ క్లైమాక్స్ లో చరణ్ ట్రైన్ ఫై నిలబడే వెళ్లి సీన్స్ తీసేసి చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారట.

ఇక చిత్ర డైరెక్టర్ బోయపాటి శ్రీను ఫై సోషల్ మీడియా లో ఇప్పటికే ట్రోల్స్ మొదలయ్యాయి. ‘ధ్రువ , రంగస్థలం’ చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన చరణ్ కు ఇలాంటి సినిమా ను బోయపాటి శ్రీను ఇస్తాడని ఊహించలేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం చరణ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోనుంది. సంక్రాంతి పండుగ కు చరణ్ నటించిన గత చిత్రాలు ‘నాయక్ , ఎవడు’ విడుదలై సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం తో హ్యాట్రిక్ కొడతాడని ఫ్యాన్స్ భావించారు కానీ బోయపాటి వారి ఆశలఫై నీళ్లు చల్లాడు.

సంబంధిత సమాచారం :

More