మొదటివారం పటాస్ కలెక్షన్ల వివరాలు

మొదటివారం పటాస్ కలెక్షన్ల వివరాలు

Published on Jan 31, 2015 9:05 PM IST

patas-movie-review
అందరూ ముందుగా ఉహించినట్టే పటాస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయకేతనాన్ని ఎగురవేసింది. అనీల్ రావిపూడి అందించిన ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు అద్భుతంగా స్వీకరించారు. విడుదలైన తొలిరోజు నుండే అదిరిపోయే టాక్ ని సంపాదించుకున్న ఈ చిత్రం ఆంధ్రా తెలంగాణాలు కలిపి మొదటివారంలో 9కోట్లు వసూలు చేసింది.

కళ్యాణ్ రామ్ పాత్ర చిత్రీకరణ కధను ఫాస్ట్ గా తెరకెక్కించిన విధానం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. పాజిటీవ్ రివ్యూలకు ప్రేక్షకుల మౌత్ టాక్ కూడా తోడవ్వడంతో సినిమా విజయం ఖరారయింది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సూచనలు పుష్కలంగా వుండడం శుభసూచకం.

తాజా వార్తలు