బాలయ్య సినిమాకు సెకాండాఫ్ హైలెట్ !

నందమూరి బాలక్రిష్ణ చేసిన తాజా చిత్రం ‘జై సింహ’ ఈ జనవరి 12వ తేదీన రిలీజవుతున్న సంగతి తెలిసిందే. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలకానున్న ఈ చిత్రానికి సెకండాఫ్ మేజర్ హైలెట్ కానుందట.

వైజాగ్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా గొప్పగా వచ్చాయని, అవి గనుక క్లిక్ అయితే సినిమా భారీ విజయాన్ని సాధించడం ఖాయమని సి.కళ్యాణ్ అంటున్నారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు.