మంచు విష్ణుకి సెకండ్ హీరోయిన్ దొరికేసింది !

2nd, January 2017 - 04:49:21 PM

surabhi
మంచు హీరో విష్ణు తాజా చిత్రం ‘లక్కున్నోడు’ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే విష్ణు మరో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘అడ్డా’ ఫేమ్ జి. కార్తిక్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో విష్ణు సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.

కొన్ని రోజుల క్రితమే ఈ ఇద్దరిలో ఒకరిగా మలయాళ హీరోయిన్ మియా జార్జ్ ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు రెండవ హీరోయిన్ గా ‘జెంటిల్మెన్’ ఫేమ్ ‘సురభి’ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. విష్ణు సరికొత్త లుక్ లో కనిపిస్తుండటంతో అతనికి జోడీగా సురభి అయితే బాగుంటుందని భావించి ఆమెను సెలెక్ట్ చేసుకున్నారట దర్శకనిర్మాతలు. ఇకపోతే ఈ చిత్రం జనవరి 3వ వారం నుండి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది.