కణం నుండి మరో పాట రాబోతోంది!
Published on Mar 3, 2018 2:12 pm IST

ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో నాగ శౌర్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న సినిమా కణం. ఈ చిత్రంలో ‘పెళ్లి చూపులు’ ప్రియదర్శి కీలక పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సోషల్ మెసేజ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లైకప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించడం విశేషం.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా తమిళ్‌లో కరు పేరుతో రానుంది. మర్చి 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి నాలుగేళ్ల కూతురికి తల్లి పాత్రలో కనిపించబోతుండడం విశేషం. తాజాగా చెన్నై లో ఈ సినిమా ఆడియో విడుదల అయ్యింది. ఈరోజు రాత్రి 8గంటలకు ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చెయ్యనున్నారు.

 
Like us on Facebook