సూర్య ‘ఎన్.జి.కే’ టైటిల్ వెనకున్న రహస్యం ఏమిటంటే !
Published on Mar 6, 2018 10:46 am IST

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 36వ సినిమాను ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత వరకు చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను నిన్న సెల్వ రాఘవన్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేశారు. సినిమాకు ఆసక్తికరంగా ‘ఎన్.జి.కే’ అనే టైటిల్ ను పెట్టడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఇంతకీ అందులోని అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువైంది.

నిన్న మీడియాతో మాట్లాడిన సెల్వ రాఘవన్ ‘ఎన్.జి.కే’ అనేది సినిమాలో సూర్య పాత్ర పేరని, అతని పాత్ర చాలా వైవిధ్యంగా, ఛాలెంజింగా ఉంటుందని అన్నారు. అంతేగాక ఇప్పుడే ఆయన పాత్ర, చిత్ర కాన్సెప్ట్ ఏమిటనేది బయటపెట్టదలుచుకోలేదని కూడ అన్నారు. సూర్యకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభులు నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook