సమాజానికి అవసరమైన సినిమా ‘నీది నాది ఒకే కథ’ – శేఖర్ కమ్ముల

21st, March 2018 - 05:04:36 PM

శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రశంసల వర్షం కురిపించారు. ‘నీది నాది ఒకే కథ’ లాంటి సినిమాలు సమాజానికి చాలా అవసరమన్న కమ్ముల సినిమాలో తల్లిదండ్రులు, సిస్టమ్ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెడుతున్నారో చూపించారని అన్నారు.

దర్శకుడు మొదటి సినిమానే అయినా చాలా బాగా తీశాడని, శ్రీవిష్ణు కూడ గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఇంకా బాగా నటించాడని అన్నారు. ఆరన్ మీడియా పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ లు నిర్మించిన ఈ చిత్ర మేకింగ్ కోసం డోగ్మే 95 అనే టెక్నాలజీని వాడారు యూనిట్. సాట్నా టైటస్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది.