శేఖర్ కమ్ముల సినిమా ఖరారు కాలేదు !

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల చెయ్యబోయే సినిమాకు సంభందించి కొన్ని వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం మేరకు శేఖర్ కమ్ముల ప్రస్తుతం యు.ఎస్ లో స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కథ సిద్దం అయ్యాక ఇండియా వచ్చి ఆ కథ ఎవరికి సెట్ అవుతుందో వారికి చెప్పబోతున్నాడని సమాచారం.

ఇదివరుకు శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వచ్చిన వార్తలు అన్ని అవాస్తవాలేనని తెలుస్తోంది. ‘ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ములతో సినిమా చెయ్యడానికి చాలా మంది హీరోలు సిద్ధంగా ఉండగా ఆయన ఏ హీరోతో చేస్తారో చూడాలి.