లగ్జరీ కారవ్యాన్‌ని కొనుగోలు చేసిన నరేశ్.. ప్రత్యేకతలు ఇవే..!

Published on Jan 25, 2022 9:36 pm IST

సీనియర్ నటుడు నరేశ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే షూటింగ్ సమయంలో ఇతర నటీనటుల కారవ్యాన్‌లో ఉండాల్సి వస్తుందని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది మంచిది కాదని భావించిన నరేశ్ సొంతంగా ఓ కారవ్యాన్‌నే కొనేశాడు. అయితే భారీగానే ఖర్చు చేసి ముంబై నుంచి తెప్పించుకున్న ఈ కారవ్యాన్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

ఫుల్ ఏసీతో ఉన్న ఈ వ్యాన్‌లో పడుకునేందుకు బెడ్, రిలాక్స్ చైర్, మేకప్ ప్లేస్, టీవీ యూనిట్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్ రూమ్ వంటి సౌకర్యాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కారవ్యాన్ కొనుగోలు విషయంపై నరేశ్ మాట్లాడుతూ “నటులకు కారవ్యాన్‌లు మరో ఇల్లు లాంటివని, ప్రస్తుతమున్న పరిస్థితులో వేరే నటుల కారవ్యాన్‌లు వాడడం ఉత్తమం కాదని, అందుకే మంచి కారవ్యాన్ కొనుగోలు చేయాలనుకుని నిర్ణయించుకుని, నా అవసరాలకు అనుగుణంగా ఈ కారవ్యాన్‌ని తయారు చేయించుకున్నానని” చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :