మహేష్ టీం కి సహజ నటి శుభాకాంక్షలు

Published on Jan 15, 2020 7:19 pm IST

సీనియర్ హీరోయిన్ జయసుధ సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ పై తన ప్రేమాభిమానాలు ప్రకటించారు. సంక్రాంతి సంధర్భంగా సరిలేరు నీకెవ్వరు టీంకి శుభాకాంక్షలు తెలిపారు. సహజనటి జయసుధ ట్విట్టర్ వేదికగా లవ్ టూ..మహేష్ బాబు, విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి మరియు సరిలేరు నీకెవ్వరు ఎంటైర్ టీమ్ అని ట్వీట్ చేయడం జరిగింది. సీనియర్ హీరోయిన్ జయసుధ తమ చిత్రంపై స్పందించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.

సరిలేరు నీకెవ్వరు అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సరిలేరు నీకెవ్వరు ప్రదర్శించబడుతున్న థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల కోలాహలం, హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఇక ఈవిజయాన్ని అభిమానులతో కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేస్తుంది. ఈనెల 17న హనుమకొండ లో సక్సెస్ మీట్ భారీగా నిర్వహిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయ శాంతి కీలక రోల్ చేశారు.

సంబంధిత సమాచారం :