అలనాటి నటి జ్యోతిలక్ష్మి ఇకలేరు!

9th, August 2016 - 09:04:25 AM

jyothilaxmi
‘జ్యోతిలక్ష్మి’ అన్న పేరు చెప్తే చాలు, 1970వ దశకంలో ఏ తెలుగు సినీ అభిమాని అయినా చకచకా ఆమె గురించి చెప్పేస్తారు అన్నంతగా పాపులారిటీ సంపాదించుకున్న నటి జ్యోతి లక్ష్మి ఇకలేరు. అనారోగ్యం వల్ల కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ వస్తోన్న ఆమె, ఈ ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఎన్నార్ సహా పలువురు టాప్ స్టార్స్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి తనదైన బ్రాండ్ సృష్టించుకున్న జ్యోతిలక్ష్మి సుమారు 300లకు పైగా సినిమాల్లో నటించారు.

తెలుగు, తమిళ, మళయాల, హిందీ.. ఇలా ప్రధాన భాషా సినిమాలన్నింటిలో నటించిన జ్యోతిలక్ష్మి, తెలుగులో ఒక దశాబ్ధంన్నర పాటు తిరుగులేని పాపులరాటీ సంపాదించుకున్నారు. ‘డ్రైవర్ రాముడు’, ‘అడవి రాముడు’, ‘స్టేట్ రౌడీ’, ‘బెబ్బులి’.. తదితర సినిమాల్లో నటించిన ఆమె ఒక సినిమాలో ఉన్నారన్న మాటే అప్పట్లో ఆ సినిమాకు ప్రచారం తెచ్చేదట. ఇక ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఆమె పేరుకు ఉన్న పాపులారిటీ తిరుగులేనిదని చెబుతూ, తన దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమా జ్యోతిలక్ష్మి అనే పేరు పెట్టుకున్నారు.