మరోసారి లక్ పరీక్షించుకోనున్న సీనియర్ హీరో !
Published on Oct 25, 2017 4:42 pm IST

సీనియర్ హీరో శ్రీకాంత్ ఒకవైపు పూర్తి స్థాయి హీరోగా నటిస్తూనే మరోవైపు బలమైన సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ ఈ మధ్యే ‘యుద్ధం శరణం’ తో ప్రతినాయకుడిగా మరొక ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వీటిలో సపోర్టింగ్ రోల్స్ ఆయనకు బాగానే వర్కవుట్ అవుతున్నా సోలో హీరోగా మాత్రం సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్నారాయన. ఆయన ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన చివరి చిత్రాలు ‘టెర్రర్, మెంటల్ పోలీస్’ పరాజయాన్ని చవిచూడటంతో మరొక ప్రయత్నం చేసేందుకు సిద్దమయ్యారాయన.

అందుకోసం ఈసారి ఆయన చేసిన చిత్రం ‘రా..రా’. దర్శకుడు శంకర్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ థ్రిల్లర్ గా రూపోందిన ఈ చిత్రంలో నజియా, సీతా నారాయణ హీరోయిన్లుగా నటించారు. షకీల్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని విజి చెరిష్ విజన్ బ్యానర్ పై విజయ్ నిర్మించారు. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.

 
Like us on Facebook