సీనియర్ హీరోయిన్ సుమలతకు కరోనా.

Published on Jul 7, 2020 11:20 am IST

సీనియర్ నటి సుమలత అంబరీష్ సోమవారం నాడు తనకు కరోనా సోకిందని ప్రకటించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా టెస్టులు చేయించుకున్నానని..అందులో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ‘ఈ రోజు నాకు రిజల్ట్స్ తెలిశాయి.. పాజిటివ్ అంటూ వచ్చింది’ అని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.తనకు ఇమ్మ్యూనిటీ లెవెల్స్ ఎక్కువని, త్వరగా కోలుకొని తిరిగి వస్తాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యుల సలహా మేరకు తాను హోమ్ క్వారెంటైన్ లో ఉన్నానని తెలిపారు.

లోక్ సభ మెంబర్ అయిన సుమలత ఇటీవల కాలంలో తాను ఎవరెవరిని కలిశారో.. వారి సమాచారాన్ని అధికారులకు ఇచ్చారు. అందులో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. తనను కలిసిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పుకొచ్చారు. అలా చేస్తే అధికారులను కూడా ట్రేస్ చేసే పని తగ్గుతుందని కోరారు.

సంబంధిత సమాచారం :

More