
ఒక డైరెక్టర్ గా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించిన సీనియర్ డైరెక్టర్ తమ్మా రెడ్డి భరద్వాజ్ తాజాగా ఫాం అయిన ప్రొడ్యూసర్స్ సిండికేట్ పైన ద్వజమెత్తారు. తాజాగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఒక 8 మంది నిర్మాతలు కలిసి ఒక సిండికేట్ గా ఫాం అయ్యి చిన్న సినిమాల నిర్మాతలని ట్రాప్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ పేరు చెప్పుకొని కొంతమంది మాత్రమే లాభం పొందుతున్నారు. చెప్పాలంటే ఈ 8 మంది కొంతమంది మీడియాని మాత్రమే లెక్కలోకి తీసుకొని పబ్లిసిటీ పరంగా చిన్న నిర్మాతలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భరద్వాజ్ అన్నారు.
ఈ 8 మంది నిర్మాతలు ఓ సిండికేట్ గా కలిసి ఇలా చిన్న నిర్మాతలకు ఇబ్బంది క్రియేట్ చేస్తుండడం వలన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి చెడ్డ పేరు వస్తుందని, అది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. నిర్మాతల సంక్షేమం కోసమే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని స్థాపించాం కానీ ఇప్పుడు ఓ 8 మంది సిండికేట్ గా ఫాం అయ్యి కొంతమంది మీడియా వాళ్ళతో కలిసి పబ్లిసిటీ కోసం నిర్మాతల నుంచి ఎక్కువగా కమీషన్ ని తీసుకుంటున్నారు. మేము ఇది వరకు వారికి వార్నింగ్ ఇచ్చినా వాళ్ళు మారడం లేదు. అందుకే నేను మీడియా ముందుకు వచ్చాను. సినీ పరిశ్రమకి మీడియా వారు ఎప్పుడూ అండగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని విడదీసి కొంతమందినే ఉంచాలనుకోవడం చాలా పెద్ద తప్పు. వెళ్ళు ఇలాంటి పనులు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి తప్పుకొని చేసుకోవాలని భరద్వాజ్ తెలిపారు. మరి ఈ 8 మంది సిండికేట్ వారు మారుతారా లేక ఇలానే చిన్న నిర్మాతలను ఇబ్బంది పెడతారా అన్నది చూడాలి.

