సెన్సేషనల్ టీఆర్పీతో “బిగ్ బాస్ 4” గ్రాండ్ ఎపిసోడ్.!

Published on Sep 17, 2020 11:54 am IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకొని ఇపుడు నాలుగో సీజన్లోకి అడుగు పెట్టింది. గత సీజన్ ను ఎంతో అద్భుతంగా రక్తి కట్టించిన హోస్ట్ కింగ్ నాగార్జున మళ్ళీ ఈసారి సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా చేయనుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే బిగ్ బాస్ సీజన్ కు సంబంధించి మాత్రం మొట్ట మొదటి ఎపిసోడ్ అలాగే ఫైనల్స్ ఎపిసోడ్ ఎంత కీలకమో తెలిసిందే. అలా ఈసారి సీజన్ గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ కు భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సీజన్ మొట్టమొదటి ఎపిసోడ్ కు ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిందట.

అది కూడా ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్ల కంటే మించి ఆల్ టైం రికార్డు టీఆర్పీను నెలకొల్పిందట. ఇదే కింగ్ నాగ్ హోస్ట్ గా చేసిన లాస్ట్ సీజన్ కు 17.9 టీఆర్పీ రేటింగ్ రాగా దానిని బద్దలు కొట్టి మళ్ళీ కింగ్ నాగ్ స్మాల్ స్క్రీన్ కింగ్ అనిపించుకున్నారు.

సంబంధిత సమాచారం :

More