ప్రైవేట్ సాంగ్ లో తొలిసారి గా ప్రియా ప్రకాష్ వారియర్

Published on Jan 14, 2021 8:00 am IST

సెన్సేషనల్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తొలిసారి ప్రైవేట్ సాంగ్ లో నటించారు. రోహిత్ నందన్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఈ పాటను తెరకెక్కించారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. సంక్రాంతి సందర్భంగా లడీ లడీ పాటను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటకు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.

పబ్ లో పక్క మాస్ బీట్ లో సాగిపోయే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియా వారియర్ అందాలు.. రోహిత్ నందన్ అద్భుతమైన డాన్స్ పాటకు హైలైట్స్. మ్యాంగో సంస్థ నుంచి ఈ పాట విడుదలైంది.

సంబంధిత సమాచారం :

More