తెలుగులో “అవతార్ 2” కి సెన్సేషనల్ వసూళ్లు.!

తెలుగులో “అవతార్ 2” కి సెన్సేషనల్ వసూళ్లు.!

Published on Dec 17, 2022 2:01 PM IST

హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్” చిత్రాన్ని ఫైనల్ గా మేకర్స్ దాదాపు 13 ఏళ్ళు తర్వాత రిలీజ్ చేయగా దీనికి అనుకున్నట్టుగానే సాలిడ్ పాజిటివ్ మౌత్ టాక్ ఏర్పడింది. ఇక తెలుగులో అయితే ఈ చిత్రం సెన్సేషన్ ని నమోదు చేస్తూ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది కూడా టాక్ ఉంది. అయితే ట్రేడ్ వర్గాల నుంచి లేటెస్ట్ గా ఈ చిత్రం తెలుగు లో ఓపెనింగ్స్ వసూళ్లు ఎంత వచ్చాయి అనేది తెలుస్తుంది.

మరి తెలుగులో అవతార్ 2 ఫస్ట్ డే కోట్లు 14 కోట్ల గ్రాస్ ని రాబట్టిందట. మరి హాలీవుడ్ సినిమాల నుంచి అయితే ఇది రికార్డు మొత్తంలో అన్నట్టు తెలుస్తుంది. చిత్రం 3 గంటలు పైగా అయినప్పటికీ ఆడియెన్స్ ఏమాత్రం తగ్గకుండా హౌస్ ఫుల్స్ పెడుతున్నారు దీనితో ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ సెన్సేషన్ గా మారింది. ఇక ఫైనల్ రన్ లో అయితే ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు