ఓటిటిలో “ది గ్రే మ్యాన్” వరల్డ్ వైడ్ సెన్సేషనల్ రెస్పాన్స్.!

ఓటిటిలో “ది గ్రే మ్యాన్” వరల్డ్ వైడ్ సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Jul 24, 2022 4:47 PM IST


లేటెస్ట్ హాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యిన భారీ యాక్షన్ చిత్రాల్లో “ది గ్రే మ్యాన్” కూడా ఒకటి. ప్రపంచ దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అనేక భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో అవెంజర్స్ ఫేమ్ క్రిస్ ఇవాన్స్ మరియు రియాన్ గోస్లింగ్ మన ఇండియన్ స్టార్ ధనుష్ కీలక పాత్రలో నటించిన భారీ యాక్షన్ చిత్రం ఇది. మరి సాలిడ్ ప్రమోషన్స్ నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఫస్ట్ డే లోనే రికార్డు స్థాయి రెస్పాన్స్ ని అందుకుంది.

మరి ఈ సినిమా విడుదల అయ్యిన ఒక్కరోజులోనే ప్రపంచ వ్యాప్తంగా కూడా నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానం లోకి వచ్చేయగా ఏకంగా 91 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఈ చిత్రం ట్రెండ్ అవుతుందని ఈ చిత్ర దర్శకులు రూసో బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో తమ కాస్ట్ అండ్ కృ సహా సినిమాని ఎవరైతే చూసారో వారి అందరి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఇంకా ఎలాంటి రికార్డ్స్ అందుకుంటుందో చూడాలి.

https://twitter.com/Russo_Brothers/status/1550947637037125632

సంబంధిత సమాచారం

తాజా వార్తలు