టాలీవుడ్ బిగ్గిస్ లో ఒకటైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ వాస్తవానికి సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడిందని తెలుస్తోంది. మేకర్స్ అయిన హోంబలే ఫిలిమ్స్ వారి నుండి దీని పై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. దానితో ఒక్కసారిగా పలు సినిమాల రిలీజ్ ల సమీకరణాలు అన్ని కూడా మారిపోయాయి. ఇక అదే రోజున యువ నటుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న రూల్స్ రంజన్, రామ్ పోతినేని స్కంద సినిమాల రిలీజ్ ల పై ఆయా సినిమాల మేకర్స్ ప్రకటనలు ఇచ్చారు.
అలానే వీటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతికా సునీల్ కుమార్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ కూడా అదే రోజున విడుదల కానుంది. ఇక శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న పెద్ద కాపు 1 సెప్టెంబర్ 29న రానుంది. వీటితో పాటు పాన్ ఇండియన్ మూవీ ది వ్యాక్సిన్ వార్ సెప్టెంబర్ 28న విడుదల కానున్నాయి. మొత్తంగా అయితే సెప్టెంబర్ ఎండింగ్ లో వరుసగా ఈ సినిమాల రిలీజ్ లతో ఆడియన్స్ కి సినిమాల పండుగే అని తెలుస్తోంది.