కరోనా బారినపడిన హీరోయిన్..!

Published on Jul 1, 2020 10:44 am IST

ఇటీవల ఇద్దరు బుల్లితెర నటులు ప్రభాకర్ మరియు హరికృష్ణ లకుకరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇటీవల కొన్ని సీరియల్ షూటింగ్స్ లో వారు పాల్గొనగా కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో బుల్లి తెర స్టార్ కు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. ‘నా పేరు మీనాక్షి’ మరియు ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న నవ్య స్వామి వైరస్ బారిన పడ్డట్లుగా తెలుస్తోంది.

కరోనా వైరస్ లక్షణాలతో ఆమె బాధపడుతుండగా వైరస్ నిర్థారణ పరీక్షకు వెళ్లగా అక్కడ పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. దీనితో ఆమె పాల్గొన్న షూటింగ్ టీం సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారట. షూటింగ్స్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ పడింది. బడా చిత్రాల దర్శక నిర్మాతలు, హీరోలు షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు.

సంబంధిత సమాచారం :

More