బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కరోనా.

బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కరోనా.

Published on Jul 4, 2020 8:41 AM IST

కరోనా వైరస్ బుల్లితెర నటులపై పంజా విసురుతుంది. వరుసగా అనేక మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్, హరికృష్ణ మరియు నవ్య స్వామిలకు కరోనా సోకడం జరిగింది. తాజాగా మరో బుల్లితెర నటుడు కోవిడ్ బారిన పడ్డాడు. బుల్లితెరపై అనేక సీరియల్స్ లో నటించిన రవి కృష్ణకు కరోనా సోకింది. కొద్దిపాటి కరోనా లక్షణాలతో ఆయన బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేశారు. దానితో ఆయనకు కరోనా అని తేలింది.

దీనితో అప్రమత్తమైన వైద్యులు అతన్ని కొరెంటైన్ చేసి చికిత్స అందిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఆయనతో క్లోజ్ అసోసియేషన్ కలిగిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. రవి కృష్ణ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నాడు. ఇప్పటికే అన్నిరకాల షూటింగ్స్ నిలిపివేయడం జరిగింది. కోవిడ్ కారణంగా చిత్ర పరిశ్రమ మరిన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు